KMR: బాన్సువాడ పట్టణంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ మంత్రి అంజవ్వ గణేష్ ఆధ్వర్యంలో శనివారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.