HNK: హనుమకొండ JNS స్టేడియంలో శనివారం సౌత్ జోన్ ఖోఖో నేషనల్లో పాల్గొనే తెలంగాణ మహిళా, పురుషుల జట్లను ఎన్నుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఖోఖో సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచి దేశంలో తెలంగాణను ప్రథమ స్థానంలో నిలపాలని ఆయన సూచించారు.