SKLM: భారత అత్యున్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ బి.ఆర్ గవాయిపై దాడి అత్యంత హేయమని దీనిని ప్రతి భారతీయుడు ఖండించాలని షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం అధ్యక్షులు కొత్తపల్లి మోహనరావు అన్నారు. శనివారం మందసలో గల అంబేడ్కర్ విజ్ఞాన భవనంలో సమావేశం నిర్వహించారు. ఈ దాడి ఒక్క గవాయిపై కాదని భారత న్యాయ వ్యవస్థ పైనే కాకుండా ప్రపంచం గర్వించదగ్గ భారత రాజ్యంగం పైన అని అన్నారు.