KDP: ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోని 33వ వార్డు ఆర్ట్స్ కాలేజ్ రోడ్డులో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వెంకటలక్ష్మికి చెందిన మట్టిమిద్దె కూలిపోయింది. కాగా, అదృష్టవశాత్తు, మిద్దె కూలిపోయే సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం సంభవించలేదు. ఈ విషయం తెలిసిన వెంటనే వార్డు కౌన్సిలర్ గాజుల శివజ్యోతి సంఘటనా స్థలానికి చేరుకుని మిద్దెను పరిశీలించారు.