TPT: తిరుపతి గరుడ వారధి ఫ్లైఓవర్ ప్రమాదంలో చంద్రగిరి మండలానికి చెందిన ఇద్దరు యువకులు మృతిచెందడంపై ఎమ్మెల్యే పులివర్తి నాని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు బాధిత కుటుంబాలకు పూర్తి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కాగా, తన కార్యకర్తలకు వెంటనే ఫోన్ చేసి, అంత్యక్రియల సహా అన్ని కార్యక్రమాలను సజావుగా పూర్తి చేయాలని ఆదేశించారు.