వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి ఫోన్ మిస్సయ్యిందంట. దీంతో… తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 21న విజయసాయిరెడ్డి పర్సనల్ ఐఫోన్ పోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అయితే ఈ ఐ ఫోన్ ఎక్కడ మిస్ అయ్యింది, అది మిస్ అయ్యింది అని విజయసాయిరెడ్డి ఎప్పుడు గుర్తించారు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఈ విషయం మీద పూర్తి క్లారిటీ లేదు. గత రెండు రోజులుగా సాయిరెడ్డి తాడేపల్లిలో ఉన్నారనే సమాచారం కూడా ఎక్కడా పబ్లిక్ డొమైన్లో లేదు. అదే నిజమైతే తాడేపల్లిలో ఎందుకు కేసు నమోదు చేశారనేది ప్రశ్న.
కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో విజయసాయిరెడ్డికి నోటీసులు వచ్చే అవకాశం ఉందని, అందుకే ఈ మిస్సింగ్ ఫిర్యాదును ఉపయోగించి ఆయన ఫోన్ తనిఖీ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సాయిరెడ్డి అల్లుడు సోదరుడు ఈ స్కామ్లో అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇన్ఫర్మేషన్ బయటపడుతుందనే భయంతోనే ఫోన్ పోయిందని విజయసాయిరెడ్డి డ్రామాలు ఆడుతున్నారని టీడీపీ నాయకులు ఆరోపించారు. ఫోన్ పోలేదని.. కావాలనే పడేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ”ఏ 2 ఫోన్ పోలేదు.. పడేసాడు. ఢిల్లీ లిక్కర్ స్కాం తో తాడేపల్లి ప్యాలస్ పూసాలు కదులుతున్నాయి.” అంటూ టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ట్వీట్ చేశాడు. విజయసాయిరెడ్డి ఫోన్ పోయిందా? లేక జగన్ లాక్కున్నారా? అంటూ మాజీ మంత్రి జవహర్ ప్రశ్నించారు. ఈడీ విచారణలో బాగోతం బయటపడుతుందనే కొత్త డ్రామాకు తెరలేపారని వారు ఆరోపిస్తున్నారు.