BHPL: జిల్లా సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయంలో CM రీజినల్ కమిషనర్ హరిపచౌరి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులకు జాప్యం లేకుండా సీఎంపీఎఫ్ సేవలను త్వరగా అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పెన్షన్ లావాదేవీలు సీ కేర్స్ పోర్టల్ ద్వారా జరుగుతున్నాయని, కొత్త క్లైమ్స్ కోసం ప్రయాస్ పోర్టల్‌ను ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు.