HYD: అమీర్‌పేటలో గల రెండు మొబైల్ దుకాణాలపై యాపిల్ కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ దుకాణాలు యాపిల్ లోగో, ట్రేడ్ మార్క్‌లను అనుకరించి, నకిలీ iPhone, iPad, AirPods 2లను విక్రయించడం మేధో సంపత్తి హక్కుల (IPR) ఉల్లంఘనగా కంపెనీ పేర్కొంది. దీనిపై భారతీయ న్యాయ సంహిత (BNS), కాపీరైట్ చట్టం కింద SR నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.