సంగారెడ్డి: ధారూరు మండల పరిధిలోని రుద్రారం – నాగసమందర్ గ్రామాల మధ్య కోటపల్లి అలుగు వద్ద కొట్టుకుపోయిన రోడ్డుకు ఆర్ అండ్ బీ రోడ్డుకు అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేశారు. భారీ వర్షాల కారణంగా కల్వర్టు రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. వెంటనే మట్టి నింపి రోడ్డు వేయడంతో రాకపోకలు ప్రారంభమయ్యాయి. దీంతో వాహనదారులు, గ్రామస్తులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.