SKLM: పోలాకి మండలం మబగాం గ్రామంలో కొలువైన వల్లభ నారాయణస్వామి ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో చేపట్టారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాస్, జడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య పాల్గొన్నారు. ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా ప్రత్యేక పూజలు చేసి శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టారు.