AP: మాజీ మంత్రి పేర్ని నానితో పాటు మరో 29 మందిపై కేసు నమోదైంది. ఆర్.పేట సీఐ ఏసుబాబుపై దౌర్జన్యం చేశారని చిలకలపూడి స్టేషన్లో ఆయనపై పోలీసులు కేేసు నమోదు చేశారు. వైసీపీ నేత సుబ్బన్నను నిన్న విచారణ కోసం పీఎస్కు పిలిచారు. ఈ క్రమంలో అక్కడికి వెళ్లిన పేర్ని నాని సీఐ విదులకు ఆటంకం కలిగించడంతో పాటు హల్చల్ చేశారు. ఈ ఘటనను ఎస్పీ తీవ్రంగా పరిగణించారు.