PDPL: సీజనల్ వ్యాపారాలు ట్రేడ్ లైసెన్స్ లేకుండా నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్, రామగుండం మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ హెచ్చరించారు. టపాకాయలు, ఉన్ని దుస్తుల విక్రయాలకు కూడా ఆన్లైన్లో తాత్కాలిక లైసెన్స్ పొందవచ్చని తెలిపారు. https://emunicipal.telangana.gov.in లో నమోదు చేసి బిల్లు చెల్లిస్తే లైసెన్స్ జారీ అవుతుందని వివరించారు.