SRD: సంగారెడ్డిలోని గిరిజన గురుకుల లా కళాశాలలో ప్రవేశాలకు ఈ నెల 13, 14న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. ఇంటర్ పాసైన, లాసెట్-2025లో అర్హత పొందిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దేశంలో ఉన్న ఏకైక గిరిజన (Boys) గురుకుల న్యాయ కళాశాల ఇదని పేర్కొన్నారు. ఇక్కడ చేరితే 5 ఏళ్ల లా కోర్సును ఉచితంగా పొందవచ్చని తెలిపారు.