BHPL: కాటారం మండలం దామెరకుంటలో ఉపాధి హామీ కూలీల ఐడెంటిఫికేషన్ ప్రక్రియ జరుగుతున్నట్లు ఇవాళ ఫీల్డ్ అసిస్టెంట్ వినోద్ కుమార్ తెలిపారు. జాబ్ కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరి ఫొటో ఐడెంటిఫికేషన్ చేస్తున్నామని, ఇప్పటి వరకు 70% పూర్తయినట్లు ఆయన వెల్లడించారు. జాబ్ కార్డు కలిగిన వారంతా తమ ఫొటో ఐడెంటిఫికేషన్ పూర్తి చేసుకోవాలని సూచించారు.