HYD: 2023 ఏడాదికి సంబంధించి NCRB రిపోర్టు విడుదల చేసింది. తెలంగాణలో నమోదైన నేరాలు 1,56,737 కాగా.. అత్యధికంగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో 23,289.. ‘సైబరాబాద్’లో 22,398, హైదరాబాద్లో 21,774 నేరాలు నమోదయ్యాయని పేర్కొంది. తాజాగా విడుదల చేసిన రిపోర్టులో అనేక విషయాలను పొందుపరిచి, కొన్ని కేసులకు సంబంధించిన కారణాలను సైతం వివరించింది.