JGL: కొడిమ్యాలలో ‘మెటాఫండ్ ఫ్రో’ యాప్ ద్వారా ప్రజలను మోసం చేసిన ముగ్గురిని అరెస్ట్ చేసారు. యాప్లో పెట్టుబడులు పెడితే మూడింతల లాభాలు వస్తాయని, విదేశీ పర్యటనలకు పంపిస్తామని నమ్మించి కోట్ల రూపాయలు దోచుకున్నారని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. కేసులో కస్తూరి రాకేష్ కుమార్, సింగిరెడ్డి తిరుపతి రెడ్డి, వీరబత్తిని రాజును పోలీసులు రిమాండ్కు తరలించారు.