ADB: బోరజ్ మండలంలోని తర్ణం గ్రామంలో లో-లెవెల్ వంతెన వద్ద ఇటీవల వేసిన రోడ్డు చెడిపోవడంతో నిత్యం ప్రమాదాలు జరగడంతో పాటు, వాహనాలు చెడిపోతున్నాయని వాహనదారులు తెలిపారు. జాతీయ రహదారైన 353బి ప్రతిరోజు వాహనాలు బ్రేక్ డౌన్ అవ్వడంతో పాటు, ట్రాఫిక్ జామ్ అవుతుందని తెలిపారు. రహదారి నిర్మాణం త్వరితగతిన చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.