MBNR: జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న అక్షయపాత్ర భోజనాన్ని రద్దు చేయాలని DYFI జిల్లా కన్వీనర్ ప్రశాంత్ తెలిపారు. ఈ మేరకు బాదేపల్లి ప్రభుత్వ బాలుర పాఠశాలలో డీఈవో ప్రవీణ్‌కు వినతిపత్రం అందజేశారు. నాణ్యత లేని భోజనంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో DYFI నాయకుడు శ్రీనాథ్‌తో పాటు తదితరులు పాల్గోన్నారు.