KMM: మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం కళాశాల ప్రిన్సిపాల్ జైదాస్ ఆధ్వర్యంలో NSS యూనిట్ విద్యార్థులు ‘క్లీన్ అండ్ గ్రీన్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణంలో పిచ్చి మొక్కలు, పరిసరాలను విద్యార్థులు తొలగించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించారు.