MNCL: బ్యాంకు సేవలను ప్రజల వినియోగించుకోవాలని దండేపల్లి సీఎఫ్ఎల్ కౌన్సిలర్ వేల్పుల రవీందర్ కోరారు. శుక్రవారం జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామంలో బ్యాంకు ఖాతాదారులకు, మహిళలకు బ్యాంకు సేవలపై అవగాహన కల్పించారు. బ్యాంకుల ద్వారా సేవింగ్స్, ఇన్సూరెన్స్ సేవలు, వ్యవసాయ, వాహన, ఇళ్ల రుణాలను అందజేస్తున్నారని తెలిపారు. ప్రజల మేలుకోసమే బ్యాంకులు పనిచేస్తున్నాయన్నారు.