ASF: ఆసిఫాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో DMLT-30, DECG-30 పారామెడికల్ కోర్సుల సీట్లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుతో పాటు ధ్రువపత్రాలను కళాశాలలో సమర్పించాలని సూచించారు. మరిన్ని వివరాలకు కళాశాలలో సంప్రదించాలన్నారు. ఈనెల 28 చివరి తేదీ అని తెలిపారు.