KMR: మద్యం తాగి వాహనం నడిపిన నలుగురికి జైలు శిక్ష విధించినట్లు దేవునిపల్లి ఎస్సై రంజిత్ శుక్రవారం తెలిపారు. KMR పట్టణంలోని దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనం నడిపి పట్టుబడిన వారిని కామారెడ్డి సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టినట్లు చెప్పారు. కోర్టు నలుగురికి ఒక రోజు జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.1000 జరిమాన విధించిందన్నారు.