GNTR: తెనాలిలో RTC బస్సులు కిక్కిరిసి ప్రయాణిస్తున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ మరింత అధికంగా ఉంటోంది. తెనాలి-గుంటూరు మార్గంలోని యూనివర్సిటీలు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు ఉదయాన్నే బస్సులు ఎక్కేందుకు ఇబ్బందులు పడుతున్నారు. సాధారణ ప్రయాణికులు, విద్యార్థులు కూడా ఎక్కువగా ఉండటంతో బస్సులన్నీ కిటకిటలాడుతున్నాయి.