GDWL: వడ్డేపల్లి మండలం జూలేకల్ గ్రామానికి గత కొన్ని రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని గ్రామస్తులు తెలిపారు. దీంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతూ, దేవాలయ బోర్లు, పంపు సెట్ల దగ్గరికి వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారుల స్పందించి నీటిని పునరుద్ధరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.