ప్రకాశం: ఒంగోలు నగరంలో విద్యుత్ నిర్వహణ పనుల దృష్ట్యా కర్నూలురోడ్డు, శ్రీరామ్ కాలనీ, గణపతినగర్, విరాట్ నగర్, ఆంధ్రకేసరి నగర్, చైతన్య నగర్ తదితర ప్రాంతాలకు శుక్రవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈ పాండురంగారావు తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు.