ASR: జిల్లా ఏపీటీఫ్ (ఆంధ్ర ప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్) అధ్యక్షుడు జగన్మోహన్ ఆధ్వర్యంలో గురువారం పాడేరులో నూతన ఉపాధ్యాయ కరదీపిక-2025 పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారి పీ.బ్రహ్మాజీరావు ముఖ్య అతిథిగా పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు, విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలన్నారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ నేతలు పాల్గొన్నారు.