WGL: వర్ధన్నపేట మండల కేంద్రంలోని ఇల్లంద గ్రామంలో గురువారం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ‘పొలం బాట ‘కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా WGL రూరల్ ఇన్ఛార్జ్ డివిజనల్ ఇంజినీర్ ఆనందం హాజరై, మాట్లాడుతూ.. రైతులు స్వయంగా విద్యుత్ లైన్ల వద్దకు లేదా ఫీజులు వేయడానికి ప్రయత్నించవద్దని, విద్యుత్ సంబంధిత పనులను సిబ్బందికి తెలియజేసి వారిచేతనే చేయించాలని కోరారు.