MLG: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వెంకటాపూర్, తాడ్వాయి, గోవిందరావుపేట, ములుగు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు DEO సిద్ధార్థరెడ్డి ఇవాళ తెలిపారు. ఎన్నికల నిర్వహణ కోసం ఉపాధ్యాయులకు శిక్షణశిబిరం ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. నవంబర్ 8న పని దినంగా ఉంటుందని, శిక్షణలో ఉపాధ్యాయులు తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు.