ELR: వేలేరుపాడు PHCలోని 108 వాహనం నెల రోజులుగా మొరాయిస్తోంది. బుధవారం లచ్చిగూడెంకి చెందిన మచ్చ సుమలతకు పురిటి నొప్పులు రావడంతో జంగారెడ్డిగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మార్గమధ్యలోనే 108 వాహనం పాడై అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. దీంతో వేరే 108 వాహనంలో ఎక్కించారు. నెల రోజులుగా పాడైన వాహనాన్ని పట్టించుకోని అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.