ATP: కుందుర్పి మండల కేంద్రంలోని ఇబ్రహీం ఇంటి వద్ద గురువారం బ్రహ్మ కమలాలు వికసించాయి. మామూలుగా మొక్కుకు ఒకటి, లేదా రెండు పుష్పాలు వికసిస్తాయి. అయితే ఇబ్రహీం ఇంటి వద్ద ఉన్న మొక్కకు ఏకంగా 10 పుష్పాలు విరబూసాయి. ఈ దృశ్యాలను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతరం పుష్పాలను తమ ఫోన్లో బంధించారు.