కృష్ణా: భారతదేశ ఆయుర్వేద వైద్యరంగ ప్రముఖులు, ఆయుర్వేద మార్తాండ, భిషఙ్ఞ్మణి, వైద్యరత్న పండిత దీవి గోపాలాచార్యులు 1872 అక్టోబర్ 10న నాగాయలంక భావదేవరపల్లిలో రాజ్యలక్ష్మి – రామకృష్ణమాచార్య దంపతులకు జన్మించారు. ఈ సందర్భంగా వారి పుట్టినరోజున వారి స్వగ్రామంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో గోపాలాచారి నిలువెత్తు శిలా విగ్రహం ఆవిష్కరించునున్నారు.