MBNR: పాలమూరు యూనివర్సిటీ నుంచి సౌత్ జోన్ ఆల్ ఇండియా యూనివర్సిటీలో పాల్గొనేందుకు యోగా ఎంపికలు నిర్వహిస్తున్నట్లు బుధవారం యూనివర్సిటీ PD డా. వై.శ్రీనివాసులు తెలిపారు. ఈనెల 10న యోగ (స్త్రీ, పురుషుల) జట్ల ఎంపికలు ఉంటాయని, వయస్సు 17-25లోగా ఉండాలన్నారు. ప్రస్తుతం చదువుతున్న బోనఫైడ్, టెన్త్ మెమోతోపాటు ఎలిజిబుల్ ఫామ్ తీసుకుని రావాలని ఆయన పేర్కొన్నారు.