HYD: ఏదైనా ఒక విషయాన్ని లేదా సమాచారాన్ని షేర్ చేయడానికి ముందు ఒక్క క్షణం ఆగి మూడు విషయాలను ఆలోచించాలని HYD సీపీ సజ్జనార్ అన్నారు. ఈ పోస్టు ఎవరినైనా బాధ పెడుతుందా? ఇందులోని సమాచారం నిజమైనదేనా? సోషల్ మీడియాలో ఓ వ్యక్తిని ఉద్దేశించి పెట్టే సమాచారం ఆయన ఎదురుగాను వ్యాఖ్యానించగలవా? అనేవి సరిచూసుకోవాలన్నారు. ఏదైనా షేర్ చేసే ముందు కచ్చితంగా ఆలోచించాలన్నారు.