»Divorce Supreme Court Of India Says Directly Grant Divorce To Couples Under Article 142
Divorceపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఇష్టం లేకుంటే వెంటనే విడాకులు
స్వేచ్ఛ పేరిట జీవితాంతం కలిసి ఉండాల్సిన వారు విడిపోతున్నారు. కొన్నాళ్లు కలిసి ఉంటారు.. కాపురం, సంసారంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడినా విడాకులు తీసేసుకుంటున్నారు. ఈ నయా పోకడకు భారత అత్యున్నత న్యాయస్థానం కూడా వంతపాడింది.
గతంలో వివాహ బంధం (Marriage) అనేది పటిష్టంగా ఉండేది. ఒకసారి జీవితంలోకి వచ్చాక మరణం దాక ఒకరికొకరు కలిసి బతికేవాళ్లు. కానీ ఇప్పుడు మెచ్యుర్డ్ జీవితం.. స్వేచ్ఛ (Freedom) అనే కొత్త పదాలు తగిలిస్తూ వివాహ బంధం అర్థం మార్చేస్తున్నారు. స్వేచ్ఛ పేరిట జీవితాంతం కలిసి ఉండాల్సిన వారు విడిపోతున్నారు. కొన్నాళ్లు కలిసి ఉంటారు.. కాపురం, సంసారంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడినా విడాకులు (Divorce) తీసేసుకుంటున్నారు. ఈ నయా పోకడకు భారత అత్యున్నత న్యాయస్థానం కూడా వంతపాడింది. విడిపోవాలనుకుంటున్న వారికి శుభవార్త అందించింది. ఈ విడాకుల విషయంలో సుప్రీంకోర్టు (Supreme Court of India) సంచలన తీర్పునిచ్చింది.
భార్యాభర్తలు (Wife and Husband) కలిసి జీవించలేని పరిస్థితుల్లో వారికి వెంటనే విడాకులు ఇవ్వవచ్చని స్పష్టం చేసింది. కుటుంబ న్యాయస్థానాలకు రిఫర్ (Refer) చేయకుండానే సుప్రీంకోర్టు నేరుగా విడాకులు మంజూరు చేయాలనే అంశంపై పిటిషన్లు (Petitions) దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. జస్టిస్ ఎస్ కే కౌల్ (Justice Sanjay Kishan Kaul) నేతృత్వంలోనే ఐదుగురితో కూడిన రాజ్యాంగ ధర్మాసనం సోమవారం సంచలన ప్రకటన చేసింది.
‘దంపతుల మధ్య వివాహ బంధం కోలుకోలేని విధంగా విచ్ఛినమైతే.. ఆ కారణం కింద వారి పెళ్లి రద్దు చేసి విడాకులు మంజూరు చేయడం కోర్టుకు సాధ్యమే. ఆర్టికల్ 142 కింద విస్తృత అధికారాలను ఉపయోగించుకుని సుప్రీంకోర్టు వారికి విడాకులు మంజూరు చేయొచ్చు. భార్యాభర్తలు పరస్పర అంగీకారంతో విడిపోవాలనుకుంటే.. దీనికోసం ఆరు నెలల వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని షరతులతో తప్పనిసరి నిరీక్షణ గడువును ఎత్తివేయవచ్చు’ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.