కృష్ణా: తోట్లవల్లూరు మండలం దేవరపల్లి ఎస్సీ కాలనీలోని మండల ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు దేవరపల్లి చంద్రశేఖర్ బుధవారం ఐడీ కార్డులను పంపిణీ చేశారు. ఈ క్రమంలో ఆయన పాఠశాల ఉపాధ్యాయుల సేవా భావాన్ని ప్రశంసిస్తూ.. హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఛైర్మన్ ముల్లపూడి అప్పారావు హెచ్ఎం ఇమ్మానుయేల్, కోటేశ్వరరావు పాల్గొన్నారు.