MHBD: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పై దాడి అమానుషమని CPI ML మాస్ లైన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి అన్నారు. బుధవారం తొర్రూరు డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ.. న్యాయమూర్తి పై దాడికి పాల్పడిన నిందితుడిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.