VKB: పేదల సొంతింటి కలను ఇందిరమ్మ ఇళ్లతో కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి తెలిపారు. బుధవారం వికారాబాద్ MLA క్యాంపు కార్యాలయంలో 10వ వార్డు అనంతగిరిపల్లి ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రొసీడింగ్లను పంపిణీ చేశారు. ప్రభుత్వ ఆదేశానుసారం ఇంటి నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు.