RR: షాద్నగర్ పట్టణంలోని నెహ్రూకాలనీలో గల అంగన్ వాడీ స్కూలులో పోషణ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాస్ బాలింతలకు, గర్భవతులకు పోషకాహారం యొక్క ఉపయోగాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోషకాహారం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందరూ మహిళలు సమతుల ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు.