KRNL: పెద్దకడబూరు మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీల సొంత వనరులు ఎలా పెంచుకోవాలనే అంశంపై శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. బుధవారం డిప్యూటీ MPDO జయరాముడు మాట్లాడుతూ.. పన్నులు, పన్నేతర మార్గాల ద్వారా పంచాయతీ ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. సకాలంలో పన్నులు వసూలు చేస్తే అభివృద్ధి కార్యక్రమాలు సజావుగా సాగుతాయని తెలిపారు.