»Gujarat Bhuj Civic Official Suspended For Sleeping At Cm Bhupendra Patels Event
Bhuj Sleep సీఎం సభలో నిద్రపోయిన అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే..?
జిగర్ పటేల్ నిద్రపోతున్న వీడియోలు మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఈ వీడియోలు వైరల్ (Viral)గా మారడంతో ప్రభుత్వం దృష్టికి చేరింది. వెంటనే ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చూపారనే కారణంతో ఆయనను సస్పెండ్ చేశారు.
ముఖ్యమంత్రి (Chief Minister) పర్యటన అంటే నానా హడావుడి ఉంటుంది. సీఎం పర్యటిస్తున్నారంటే రెండు వారాల నుంచి హంగామా మొదలవుతుంది. ఇక సీఎం పర్యటన రోజును ప్రతిష్టాత్మకంగా భావించాలి. కానీ అలాంటి ముఖ్యమంత్రి పర్యటనను (CM Tour) ఓ అధికారి తేలికగా తీసుకున్నారు. సీఎం పాల్గొన్న సభలో ఆ అధికారి కొంత కునుకు (Sleep) తీశారు. ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగా ఆయన హాయిగా నిద్రలోకి జారుకున్నారు. ఇదే ఆయనను చిక్కుల్లో పడేసింది. నిద్రపోయే దృశ్యాలు వైరల్ గా మారడంతో ఆయనను ఉద్యోగంలో (Job) నుంచి తీసేశారు. ఈ సంఘటన గుజరాత్ (Gujarat)లో చోటుచేసుకుంది.
2001 నాటి భూకంప బాధితులకు (Earthquake) పునరావాసంలో భాగంగా ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన ఇళ్ల (House) పట్టాల పంపిణీ ఆదివారం జరిగింది. కచ్ జిల్లాలోని (Kutch District) భుజ్ (Bhuj) అనే ప్రాంతంలో ఈ పట్టాల పంపిణీకి సీఎం భూపేంద్ర పటేల్ (Bhupendra Patel) హాజరయ్యారు. అనంతరం సీఎం ప్రసంగిస్తుండగా స్టేజ్ ముందు వరుసలో కూర్చున్న అధికారుల్లో ఓ అధికారి నిద్రపోయారు. ఆ వ్యక్తి భుజ్ మున్సిపాలిటీ చీఫ్ ఆఫీసర్ జిగర్ పటేల్ (Jigar Patel). జిగర్ పటేల్ నిద్రపోతున్న వీడియోలు మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఈ వీడియోలు వైరల్ (Viral)గా మారడంతో ప్రభుత్వం దృష్టికి చేరింది. వెంటనే ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చూపారనే కారణంతో ఆయనను సస్పెండ్ చేశారు. ఇది క్రమశిక్షణ చర్యల్లో భాగంగా తీసుకున్న నిర్ణయమని గుజరాత్ పట్టణాభివృద్ధి శాఖ ప్రకటించింది.
CM भूपेन्द्र पटेल के कार्यक्रम में सोते दिखे थे भुज नगरपालिका के CEO, हुए सस्पेंड