ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్ ముందు ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ కమిన్స్ గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరం కానున్నట్లు సమాచారం. దీంతో అతడి స్థానంలో కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్ వ్యవహరించే అవకాశం ఉంది. అలాగే, కమిన్స్ స్థానంలో ఫాస్ట్ బౌలర్ స్కాట్ బోలాండ్‌ను తీసుకోవాలని ఆసీస్ క్రికెట్ బోర్డ్ భావిస్తోంది.