NZB: వైరల్ ఫీవర్ పట్ల జాగ్రత్తలు వహించాలని D.I.O డాక్టర్ అశోక్ సూచించారు. ఆర్మూర్లో ఆయన మాట్లాడుతూ.. వాతావరణంలో మార్పుల కారణంగా సీజనల్ జ్వరాలు వస్తాయని వివరించారు. ఇలాంటి సమయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండి, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ముఖ్యమన్నారు. ఇంటి పరిసరాలలో దోమలు లేకుండా జాగ్రత్తలు వహించాలన్నారు.