భారత్తో యుద్ధం జరిగే అవకాశాలను ఏమాత్రం తిరస్కరించలేమని పాకిస్థాన్ రక్షణమంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్ వ్యాఖ్యానించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను ఉద్రిక్తతలు కోరుకోవడం లేదని, కానీ ముప్పు పొంచి ఉన్న మాట మాత్రం నిజమని అన్నారు. ఒకవేళ యుద్ధం వస్తే, గతంలో కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామంటూ ఖవాజా బీరాలు పలికారు.