NZB: బోధన్ ఆర్టీసీ బస్టాండ్‌లో ఉదయం ఐదు గంటలకే జేబు దొంగలు రంగంలోకి దిగుతున్నారు. దసరా సెలవులు ముగియడంతో దూర ప్రాంత ప్రజలు ఉదయం నుంచే బస్టాండ్‌కు రావడంతో జేబు దొంగలు పసిగట్టి బస్టాండుకు వచ్చితిష్ట వేస్తున్నారు. ప్రయాణికులవలే బస్టాండ్‌లో కూర్చొని తమ పనులు ముగించుకొని వెళ్తున్నారు. జేబు దొంగల బెడదను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు అధికారులను కోరుతున్నారు.