నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు ఓయ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘మ్యాడ్’. ఈ సినిమాకు సీక్వెల్ రాగా.. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ‘మ్యాడ్ 3’పై నయా అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయినట్లు నటుడు విష్ణు ఓయ్ చెప్పారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతున్నట్లు వెల్లడించారు.