యూపీఐ చెల్లింపులకు ఇప్పటివరకు పిన్ నమోదు చేస్తుండగా, ఇకపై వేలి ముద్ర, ఫేసియల్ రికగ్నిషన్తోనూ చెల్లింపులు చేయొచ్చు. ఈ విధానాన్ని NPCI ఆవిష్కరించింది. ముంబైలో జరిగిన గ్లోబల్ పిన్టెక్ ఫెస్టివల్లో దీన్ని ప్రదర్శించారు. ఇవాళ్టి నుంచే ఈ విధానం అమలు చేయనున్నట్లు కేంద్రం పేర్కొంది. ఆధార్ కార్డులో నమోదైన బయోమెట్రిక్ సమాచారాన్ని ఉపయోగించి ఈ వ్యవస్థ పనిచేయనుంది.