SRD: సమగ్ర శిక్ష జెండర్ ఈక్విటీ కోఆర్డినేటర్గా సునీత కన్నాను నియమిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఇక్కడ జీసీఈఓగా పనిచేసిన సుప్రియ ముత్తంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు బదిలీపై వెళ్లారు. సునీత కన్నా మాట్లాడుతూ.. బాలికల సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పారు.