ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో మిక్స్డ్ టీమ్ గ్రూపు-Hలో భారత్ వరుసగా రెండో విజయం సాధించింది. భారత్ 45-27, 45-21తో శ్రీలంకపై గెలిచింది. బాలుర సింగిల్స్‌లో కెనెత్పై లల్తాజౌలా హమర్ గెలిచాడు. సానుద- థిసత్ జంటపై భవ్య ఛాబ్రా- మిథిలీష్ కృష్ణన్ జోడీ, మిక్స్డ్ డబుల్స్‌లో లాల్‌రమ్‌సంగా- తారిణి సూరి జోడీ సత్తాచాటారు.