WNP: సోషల్ మీడియాలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఎవరైనా పోస్టులు పెడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై కే. హిమబిందు హెచ్చరించారు. సోషల్ మీడియాపై పోలీసులు నిఘా ఉంచారని తెలిపారు. మత, రాజకీయాలు ప్రోత్సహించే విద్వేష పోస్టులు పెట్టవద్దని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు.