NZB: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా SGF అండర్ 19 కబడ్డీ పోటీల్లో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఎల్లారెడ్డి విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. బీ. మధు, డీ. సతీష్ అనే క్రీడాకారులు NZB జిల్లా తరఫున రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఈ పోటీలు ఈ నెల 10-10-2025 నుంచి 12-10-2025 వరకు కోములవాంఛ, మహబూబాబాద్‌లో జరగనున్నాయి.